మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా మళ్ళీ బాధ్యతలు చేపట్టిన అశోక్ గజపతిరాజుని వైసీపీ నేతలు గట్టిగానే టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అశోక్ గజపతిరాజుపై విజయసాయిరెడ్డి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌లాంటి వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన మాన్సాస్‌లో పలు అక్రమాలకు పాల్పడ్డారని, ఆయన్ని ఎలాగైనా ఛైర్మన్ పీఠం నుంచి దించుతామని మాట్లాడుతున్నారు.