ఏపీలో సోలోగా జగన్‌ని ఎదురుకోవడం చంద్రబాబుకు సాధ్యం కావడం లేదనే చెప్పొచ్చు. అసలు ఎప్పుడు పొత్తు లేకుండా పోటీ చేయని చంద్రబాబు గత ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేశారు. టీడీపీ ఒంటరిగా బరిలో దిగి ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు ఒంటరిగానే జగన్ ప్రభుత్వంపై ఫైట్ చేస్తున్నారు. అయినా సరే బాబుకు ప్లస్ అవ్వడం లేదు. ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేసి విఫలమయ్యారు.