గత ఎన్నికల్లో జగన్ సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా ఆ జిల్లా, ఈ జిల్లా అనే తేడాలేకుండా వైసీపీ ప్రతి జిల్లాల్లోనూ ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా నాలుగు జిల్లాల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఉన్న అన్నీ సీట్లు వైసీపీనే గెలిచింది. ఈ జిల్లాలో టీడీపీకి గుండు సున్నానే మిగిలింది.