ఇప్పటికే జనాలతో బాగా గ్యాప్ వచ్చింది పవన్ కల్యాణ్ కి. ఆ గ్యాప్ పూడ్చుకోడానికి ఆయన త్వరలోనే జనాల్లోకి వస్తారని సమాచారం. జాబ్ క్యాలెండర్ పై జనసేన ఉద్యమం మొదలు పెడుతుందని, దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందించారని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ నేరుగా రంగంలోకి దిగి ఆందోళన కార్యక్రమాలతో హడావిడి చేస్తారట. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న పవన్, ఇకపై రాజకీయ ఉద్యమాలకు కూడా ప్రత్యేకంగా సమయం కేటాయిస్తారట.