ఇప్పటి వరకూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోనే రెండేళ్లు గడిపేశారు సీఎం జగన్. అయితే రాష్ట్రంలోని కొన్ని వర్గాలు మాత్రం ఇంకా అసంతృప్తితోనే ఉన్నాయి. జగన్ చేసిన వాగ్దానాలు అమలులోకి రాక, వారి కష్టాలు తీరక ఇబ్బందులు పడుతున్నవారు కూడా ఉన్నారు. అలాంటి వారిని బుజ్జగించే పనిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు జగన్. ఇప్పటికే ఆయా వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్న సజ్జల, భవిష్యత్ మీదేనంటూ భరోసా కల్పిస్తున్నారు.