వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న విషయం తెలిసిందే. అందులో సీఎం జగన్ని, 25 మంత్రులని తీసేస్తే 126 మంది వైసీపీ ఎమ్మెల్యేలు. అలాగే టీడీపీ నుంచి నలుగురు, జనసేన నుంచి ఒకరు వైసీపీలోకి వచ్చారు వీరిని కలుపుకుంటే 131 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి ఉన్నారు. ఈ 131 మంది ఎమ్మెల్యేల్లో గత రెండేళ్లలో ఎంతమంది ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకున్నారు? ఎంతమంది ఎమ్మెల్యేలు అక్రమాలు చేస్తున్నారని ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు చేసింది? అంటే అబ్బో పలువురు ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకోగా, చాలామంది ఎమ్మెల్యేలపై టీడీపీ ఆరోపణలు చేసిందని చెప్పొచ్చు.