అధికారం కోల్పోయిన దగ్గర నుంచి చంద్రబాబు, జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉన్నారు. గత రెండేళ్లుగా బాబు ఏదొక అంశంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతూనే ఉన్నారు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయానికి వ్యతిరేకంగానే బాబు మాట్లాడుతున్నారు. అలాగే జగన్ అమలు చేసే పథకాలపై విమర్శలు చేస్తున్నారు. అప్పుడప్పుడు జగన్ ప్రభుత్వంపై నిరసన దీక్షలకు కూడా దిగుతున్నారు.