ఏపీలో మరో ఉపఎన్నిక పోరుకు రంగం సిద్ధమవుతుందనే చెప్పొచ్చు. ఇప్పటికే తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. అక్కడ వైసీపీ ఎంపీ చనిపోవడంతో, ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో మళ్ళీ వైసీపీనే గెలిచిన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే బద్వేలు స్థానానికి ఉపఎన్నిక జరగనుందని తెలుస్తోంది. బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య గత మార్చి నెలలో మరణించిన విషయం తెలిసిందే.