గతంలో టీడీపీ అధికారంలో ఉండగా నారా లోకేష్ ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే ప్రజా క్షేత్రం నుంచి గెలవకుండా మంత్రి అయిన లోకేష్‌పై అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ నుంచి అనేక విమర్శలు వచ్చాయి. పైగా అదనంగా లోకేష్ మాట్లాడే మాట తీరు టీడీపీకి పెద్ద మైనస్ అయింది. అదే వైసీపీకి ఆయుధంగా మారింది. అసలు లోకేష్ మాట్లాడితే చాలు అంతా తప్పులతడకగా ఉండేది.