ఏపీ రాజకీయాల్లో యువ నాయకులకు ఏ మాత్రం కొదవ లేదు. అటు అధికార వైసీపీలో, ఇటు ప్రతిపక్ష టీడీపీలో యువ నేతలుగా ఎక్కువగానే ఉన్నారు. అయితే యువనేతలు ఎంతమంది ఉన్నా సరే మంచి క్రేజ్ ఉన్న నాయకులు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. అతి తక్కువ సమయంలోనే రాజకీయాల్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నాయకుల్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఒకరు.