ఆమధ్య ప్రకాశం జిల్లాకు చెందిన ప్రభుత్వ వైద్యుడు భాస్కర్ రావు వైద్యం కోసం కోటి రూపాయలు వెంటనే మంజూరు చేసిన సీఎం జగన్ ని అందరూ దేవుడంటూ కొనియాడారు. ఊపిరితిత్తుల మార్పిడికోసం కోటి రూపాయల ఆర్థికసాయం చేసి, అవసరమైతే మరో 50లక్షలు ఇస్తానంటూ జగన్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. అందరి ప్రశంసలు అందుకున్నారు. కానీ ఇప్పుడు అదే జగన్, కత్తి మహేష్ అనే వ్యక్తి చికిత్సకోసం కేటాయించిన 17లక్షల రూపాయలు మాత్రం తీవ్ర విమర్శలకు కారణం అవుతున్నాయి. కత్తి మహేష్ చికిత్సకోసం ఏపీ ప్రభుత్వం 17లక్షల ఆర్థిక సాయం ప్రకటించడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. సీఎం జగన్ చర్యని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు నెటిజన్లు.