రైతు సంఘాలు ఇంధన ధరలపై పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. ఈనెల 8న దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించడానికి పిలుపునిచ్చాయి. ఉదయం 10గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దేశవ్యాప్తంగా ఇంధన ధరల పెంపుకి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేపట్టాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఖాళీ గ్యాస్ సిలిండర్లతో ప్రజలు కూడా ఈ ఆందోళనల్లో భాగస్వాములు కావాలని కోరారు రైతు సంఘం నేతలు.