రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల జగడం, పరోక్షంగా షర్మిలకు కలిసొచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓవైపు తెలంగాణ కోసం ఎందాకైనా పోరాటం చేస్తానంటూ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ ప్రజానీకానికి కొద్దోగొప్పో ఆమెపై నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. అదే సమయంలో ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా తెలంగాణలో షర్మిలకు పరోక్షంగా లాభం చేకూర్చాయి.