కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పిసిసి పదవిని రేవంత్ రెడ్డికి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్ ఇంకా బాధ్యతలు తీసుకోకుండానే రంగంలోకి దిగిపోయారు. సొంత పార్టీ నేతలను కలుసుకుని పోతూ అధికార పార్టీ పై విమర్శలు కురిపిస్తున్నారు. ఇక అదే జోష్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 7న రేవంత్ రెడ్డి కొత్త పీసీసీ గా బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో గాంధీ భవన్ లో వాస్తు మార్పులు చేయిస్తున్నారు. గాంధీ భవన్ లో వాస్తు నిపుణులు , వేదపండితుల చేత పర్యవేక్షణ చేయిస్తున్నారు.