యాసంగిలో దేశంలో ఆత్యదికంగా వడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ అని హరీష్ రావు చెప్పారు. వరి పండించే వాళ్ళు ఎక్కువ అయ్యారని.. తినేవాళ్లు తగ్గారని అన్నారు. దాంతో వరి కి డిమాండ్ తగ్గుతుందని చెప్పారు. 60 వేల కిట్ల పామ్ ఆయిల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు తెలిపారు. పామ్ ఆయిల్ సాగుతో సంవత్సరానికి లక్షా 20 వేలు రైతుకు మిగులుతాయని అన్నారు. పామ్ ఆయిల్ సాగు చేసే రైతుకు పెట్టుబడి, డ్రిప్ ఫ్రీగా ఇస్తున్నామని స్పష్టం చేశారు.