ఏపీ రాజకీయాల్లో నల్లారి ఫ్యామిలీకంటూ ఒక ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీఓ ఈ ఫ్యామిలీ హవా ఎక్కువగా ఉండేది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, స్పీకర్గా, అలాగే ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన జరగడంతో కిరణ్ కాంగ్రెస్కు దూరమయ్యారు. 2014 ఎన్నికల సమయంలో జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు.