ఏపీ రాజకీయాల్లో జనసేన నాయకులు యాక్టివ్గా పనిచేస్తున్నారా? అంటే అబ్బే అసలు లేదని చెప్పేయొచ్చు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక చాలామంది జనసేన నేతలు పార్టీలు మారిపోయారు. మరికొందరు సైలెంట్ అయిపోయారు. ఇక అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సైతం పెద్దగా ఏపీ వచ్చి పోరాటాలు చేసే పరిస్తితి కనిపించడం లేదు. ఏదో అప్పుడప్పుడు మాత్రం వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.