రాజకీయాల్లో యువత ఓట్లకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. వారు తలుచుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయి. యువత ఎక్కువగా ఎవరికి మద్ధతుగా ఇస్తే వారే గెలుస్తారు. అలాంటి యువత గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున జగన్కు మద్ధతు ఇచ్చిన విషయం తెలిసిందే. కొత్తగా వచ్చిన ఓటర్లతో సహ, ఇంకా రాష్ట్రంలో ఉన్న యువ ఓటర్లు జగన్కు సపోర్ట్ చేసి వైసీపీని గెలిపించారు.