రేవంత్ రెడ్డికి పీసీసీ రావడం వెనుక చంద్రబాబు హస్తం ఉందా? అంటే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే అది నిజమే అనిపిస్తోంది. చంద్రబాబు ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో లాబీయింగ్ చేసి రేవంత్‌కు పీసీసీ ఇప్పించారని ఆరోపణలు వస్తున్నాయి. బాబు కాంగ్రెస్ అధిష్టానాన్ని కొనేశారని మాట్లాడుతున్నారు.