ఏపీలో అధికారంలో ఉన్న కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు మెరుగైన పనితీరు కనబర్చడంలో విఫలమయ్యారని పెద్ద ఎత్తున విశ్లేషణలు వస్తున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటిన కూడా కొందరు ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయడం లేదని తెలుస్తోంది. ఏదో జగన్ ఇమేజ్ మీద ఆధారపడి మాత్రం వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు తప్ప, సొంతంగా మంచి ఫాలోయింగ్ తెచ్చుకోవడం లేదని విశ్లేషకులు అంటున్నారు.