విద్యుత్ ఉత్పత్తి పేరుతో అసలే శ్రీశైలంలో తక్కువగా ఉన్న నీటిని తెలంగాణ వృథా చేస్తోందన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై స్పందించిన కేసీఆర్.. అసలు ఏపీ, తెలంగాణ మధ్య జల విద్యుత్ విషయంలో ఎలాంటి ఒప్పందాలు లేవన్నారు. అందుకే.. విద్యుత్ ఉత్పత్తిపై కృష్ణా బోర్డు జోక్యం చేసుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు.