వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తర్వాత సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో నేరుగా ఇప్పటి వరకూ ఆమె కలవలేదు. కనీసం కుటుంబ కార్యక్రమాల్లో అయినా వారిద్దరూ కలసి పాల్గొన్న ఉదాహరణలు లేవు. తాజాగా ఇద్దరికీ ఆ అవకాశం వచ్చింది. ఈనెల 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపుల పాయలో జగన్, షర్మిల భేటీ అవుతారని తెలుస్తోంది. అయితే తెలంగాణలో షర్మిల తన పార్టీ ప్రకటనకు కూడా అదే మహూర్తాన్ని ఎంచుకున్నారు. పార్టీ ప్రకటన అనంతరం తండ్రి సమాధి వద్ద ఆశీస్సులకోసం వచ్చే షర్మిల, జగన్ తో సమావేశం కాబోతున్నారని వార్తలొస్తున్నాయి.