కరోనా ముప్పు అప్పుడే తొలగిపోలేదని.. దీని ప్రభావం ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందే డెల్టా వంటి కరోనా వైరస్ వేరియంట్లతో ప్రపంచం మొత్తం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ కామెంట్ చేశారు.