రఫేల్ యుద్ధ విమానాల విక్రయ ఒప్పందంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై ఫ్రాన్స్‌లో విచారణ ప్రారంభం కావడం మళ్లీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఫ్రాన్స్‌లో ఈ కేసు దర్యాప్తునకు ఒక న్యాయమూర్తిని నియమించినట్లు ఆ దేశ మీడియా పార్ట్ తెలిపింది.