ఏపీలో జనసేన బలం రోజురోజుకూ తగ్గుతుందా? అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయాలని బట్టి చూస్తే విశ్లేషకుల నుంచి అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఆ పార్టీ ఒక్క సీటునే గెలుచుకుంది. అటు పవన్ సైతం ఓటమి పాలయ్యారు. సరే ఓడిపోయాక వెనక్కి తగ్గకుండా పనిచేస్తూ, పార్టీని బలోపేతం చేస్తున్నారా? అంటే అదేమీ చేయడం లేదు.