సాధారణంగా జాతీయ పార్టీలో అధిష్టానం చెప్పిందే ఫైనల్. ఏ రాష్ట్ర అధ్యక్షుడైన, ఏ రాష్ట్ర సీఎం అయినా జాతీయ పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ అధిష్టానాల మాట వినాల్సిందే. ఈ పార్టీల్లో ఏకనాయకత్వం ఉండదు. ప్రాంతీయ పార్టీల మాదిరిగా ఒక్క నాయకుడు చేతుల్లోనే పార్టీ నడవదు. పైగా కాంగ్రెస్ లాంటి పార్టీలో నాయకులకు మాట్లాడే స్వాతంత్ర్యం ఎక్కువ. వాళ్ళల్లో వాళ్లే విమర్శలు చేసేసుకుంటారు.