రాష్ట్రం విడిపోయాక రాజకీయాలకు కీలకంగా ఉండే విజయవాడ ప్రాంతం టీడీపీకి అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ పరిధిలో సత్తా చాటింది. కానీ ఐదేళ్లలో పరిస్తితి తారుమారింది. 2019 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ పరిధిలో వైసీపీ హవా నడిచింది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, విజయవాడ వెస్ట్, సెంట్రల్, ఈస్ట్, తిరువూరు నియోజకవర్గాలు ఉన్నాయి.