ఏదైనా రాజకీయ పార్టీ ఒక్కసారిగా అధికారం కోల్పోతే, అందులో ఉండే కొందరు నాయకులు రాజకీయంగా మనుగడ సాధించడం కష్టమని చెప్పి, అధికారంలోకి వచ్చిన పార్టీలోకి జంప్ అయిపోతారు. ఇలా అధికార పార్టీల్లోకి ప్రతిపక్ష నేతలు జంప్ అవ్వడం సహజమే. ఏపీ రాజకీయాల్లో ఇలాంటి సర్వసాధారణమే. అయితే అలా అధికార పార్టీలోకి వచ్చాక అలాంటి నాయకుల్లో కొందరికి కీలక పదవులు దక్కే అవకాశముంది. మరికొందరు పదవులు కోసం వెయిట్ చేయాల్సిన పరిస్తితి ఉంటుంది. మరికొందరు పోలిటికల్ స్క్రీన్‌పైనే కనిపించరు.