మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన భార్య అమృత ఫడ్నవీస్ లవ్ స్టోరీ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ సరికొత్తగా మరో లవ్ ప్రపోజల్ కి సిద్ధమయ్యారు. ఆల్మోస్ట్ ప్రపోజల్ పెట్టేశారు కూడా. అయితే ఈ ప్రపోజల్ సరికొత్త వ్యక్తితో కాదు, రాజకీయ పార్టీతో. అవును, శివసేనతో కొత్త లవ్ స్టోరీ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు దేవేంద్ర ఫడ్నవీస్. గతంలో వీరిద్దరి మధ్య స్నేహం ఉన్నా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో అది చెడిపోయింది, బద్ధ శత్రువులుగా మారారు. కానీ ఇప్పుడు మరోసారి తానే ఓ మెట్టు దిగి.. శివసేన ముందు కొత్త ప్రపోజల్ పెడుతున్నారు మాజీ సీఎం ఫడ్నవీస్.