జగనన్న కాలనీలు పేరిట పెద్ద ఎత్తున సీఎం జగన్, ఏపీలో ఇళ్ళు లేని పేదలకు ఉచితంగా స్థలాలు ఇచ్చి అందులో ఇళ్ళు కట్టించి ఇస్తున్న విషయం తెలిసిందే. రెండు దశల్లో దాదాపు 30 లక్షలపైనే ఇళ్ల నిర్మాణం జరగనుంది. ఇప్పటికే మొదటి దశలో ఇళ్ల నిర్మాణ కార్యక్రమం మొదలైపోయింది. పలు నియోజకవర్గాల్లో జగనన్న కాలనీలకు శంఖుస్థాపనలు కూడా జరుగుతున్నాయి.