గోషామహల్ బిజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి డీజీపీ మహేందర్ రెడ్డి ని కలిసారు. మూడు అంశాలపై డిజిపికి రాజాసింగ్ వినతి పత్రం అందజేశారు. తనకి గన్ లైసెన్స్ ఇవ్వాలని అనేకసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవట్లేదని రాజా సింగ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ కు చెప్పిన వెంటనే హైదరాబాద్ సీపీకి ఆదేశించినా ఇప్పటివరకు తనకు గన్ లైసెన్స్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి గన్ లైసెన్స్ కోసం పోలీసులను కోరుతున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మరోమారు డీజీపిని కలిసినట్టు తెలిపారు. హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ అంశంపై కూడా డిజిపి కి వినతిపత్రం రాజా సింగ్ వినతీపత్రం అందజేశారు. మల్లేపళ్లి లాంటి ప్రాంతాల్లో ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడ్డారని అన్నారు.