విశాఖ జిల్లాలో బాక్సైట్ మైనింగ్ జరగడం లేదని గోపాల కృష్ణ ద్వివేది అన్నారు. బాక్సైట్ మైనింగ్ కు ఎలాంటి అనుమతి ఇవ్వబోమని ఉత్తర్వులు కూడా ఇచ్చామని చెప్పారు. ఆరు లీజుల్లో లేటరైట్ మైనింగ్ 2010 నుంచి జరుగుతుందన్నారు. 2019లో మరో లీజు ఇచ్చినట్టు తెలిపారు. అంతే కాకుండా కేవలం 5 వేల టన్నుల తవ్వకాలకు మాత్రమే అనుమతి ఇచ్చామని చెప్పారు. ఇంత తక్కువ తవ్వకాల అనుమతితో 15 వేల కోట్ల దోపిడీ ఎలా జరుగుతుందో చెప్పాలని ద్వివేది ప్రశ్నించారు.