అధికారంలో ఉన్న పార్టీలు ఏమి చేసిన కరెక్ట్ అనే భావనతోనే పాలన చేస్తాయని సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా ముందుకెళ్తాయి. ప్రజల మన వైపే ఉన్నారనే విధంగా తప్పులు చూసుకోకుండా పనిచేస్తాయి. అయితే ప్రభుత్వంలో ఉన్న తప్పులని చెప్పే నాయకులు లేకపోతే పార్టీలకు చాలా డ్యామేజ్ జరుగుతుంది. గతంలో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంలో ఇలాంటి పరిస్తితి కనిపించింది.