సినిమాల్లో భారీగా క్రేజ్గా ఉన్న పవన్ కల్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోతున్నారనే చెప్పొచ్చు. ప్రశ్నిస్తానని జనసేన పార్టీ పెట్టిన పవన్, ఆ పార్టీని బలోపేతం చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారని విశ్లేషణలు వస్తున్నాయి. కానీ ఎంత జరిగినా మా నాయకుడు ఎప్పటికైనా సీఎం అవుతారని జనసైనికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 2014లో పోటీ చేయకపోయినా, 2019 ఎన్నికల్లో సత్తా చాటుతారని అనుకున్నారు. కానీ అప్పుడు వర్కౌట్ కాలేదు. జనసేన ఒక్క సీటు మాత్రమే గెలిచింది.