ఏపీలో జాబ్ క్యాలెండర్ ని వ్యతిరేకిస్తున్న నిరుద్యోగులకు అండగా నిలబడటానికి, ఆ సమస్యను తలెత్తుకోడానికి టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నారా లోకేష్, ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో తన ఆవేదన వ్యక్తం చేస్తూ జూమ్ మీటింగ్ లతో మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటు పవన్ కల్యాణ్ కూడా జనాల్లోకి వచ్చేందుకు ఇదే సబ్జెక్ట్ ని ఎంపిక చేసుకోడానికి సిద్ధమయ్యారు. అయితే పవన్ వారాలు, వర్జ్యాలు, మహూర్తాలు చూసుకుని వస్తాననడంతో అంతకు ముందుగానే లోకేష్.. జాబ్ క్యాలెండర్ పై సమరశంఖం పూరించారు. పవన్ కల్యాణ్ హైలెట్ చేయాలనుకుంటున్న సమస్యను లోకేష్ హైజాక్ చేశారు లోకేష్.