ఏపీలో ఈనెల 15నుంచి ఆన్ లైన్ క్లాసులు మొదలవుతాయని ఆల్రడీ విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఇప్పటికే ఆన్ లైన్ క్లాసులు మొదలు పెట్టాయి. మరి ప్రత్యక్ష తరగతులు ఎప్పటినుంచి..? పిల్లల్ని స్కూల్ కి ఎప్పటినుంచి పంపించాలి..? అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. మూడో వేవ్ ముప్పు వార్తల నేపథ్యంలో ఇంకా ప్రభుత్వాలు ఆ దిశగా నిర్ణయాలు తీసుకోలేదు. అయితే ఆ లోపు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారు. ఈమేరకు సీఎం జగన్, ఉపాధ్యాయులకు టీకా ఇవ్వడంలో ప్రాధాన్యత కల్పించాలని అధికారులకు సూచించారు.