మొన్నటివరకు ఎంతో సఖ్యతగా మెలిగిన ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా తెలంగాణ ప్రభుత్వం..కృష్ణా నదిపై ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమమని విమర్శలు చేస్తుంది. ఈ ప్రాజెక్టు సక్రమంగానే కడుతున్నామని, తెలంగాణలో పలు అక్రమ ప్రాజెక్టులు నిర్మించారని ఏపీ మంత్రులు విమర్శలు చేస్తున్నారు.