ఇటీవల జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వస్తున్న విషయం తెలిసిందే. అసలు జాబ్ క్యాలెండర్ పేరిట ప్రభుత్వం విడుదల చేసిన 10 వేల ఉద్యోగాలని ఏం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. అయితే గడిచిన రెండేళ్లలో 6 లక్షల వరకు ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం చెబుతుంది. గ్రామ వాలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలోకి తీసుకుని వాటినే ఉద్యోగాలుగా పరిగణలోకి తీసుకోవడం కరెక్ట్ కాదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.