తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. నీళ్లు , నిధులు , నియామకాలను కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కి తాకట్టు పెట్టారంటూ ఆరోపించారు. 2015 జూన్ నెలలో మొదటిసారి జరిగిన సమావేశంలో తెలంగాణ సలహాదారు విద్యాసాగర్ , హరీష్ రావు లు అంగీకారం తెలిపిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశం లో 2016 సెప్టెంబర్21 న కేసీఆర్ , చంద్రబాబు లు నీటి వాటాపై మాట్లాడుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. 299 టిఎంసీ ల నీళ్లు తెలంగాణ కు, 512ఆంధ్రప్రదేశ్ కు అంటూ ఆనాడు కేటాయింపులు చేసుకున్న మాట వాస్తవం కాదా? అని సంజయ్ ప్రశ్నించారు.