ఏపీలోని జగన్ ప్రభుత్వం నిరుద్యోగులని మోసం చేస్తుందని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జగన్ ప్రభుత్వం పది వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇక ఈ క్యాలెండర్‌పై నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా చేస్తున్నారు. ఇక ఇదే అంశాన్ని టీడీపీ నేతలు రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.