ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ...దేవుడి దయ వల్ల కోవిడ్ తగ్గుముఖం పడుతోందని సీఎం అన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అందులో భాగస్వాములైన కలెక్టర్లు, చివరిస్థాయిలో ఉన్న వాలంటీర్లు, ఆశావర్కర్లు, రెవన్యూ సిబ్బంది కోవిడ్ కట్టడిలో చాలా బాగా పనిచేశారన్నారు. నిన్నటికి డైలీ పాజిటివిటీ రేటు 3.36 శాతానికి తగ్గందని చెప్పారు. అంతే కాకుండా వీక్లీ పాజిటివిటీ రేటు 3.66శాతం ఉందని తెలిపారు. వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి అయ్యేవరకూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.