రియల్ హీరో సూద్ సేవా కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చేసిన సేవలకు గానూ ప్రజలు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా తాజాగా సోనూ సూద్ తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కలిశారు. ప్రగతి భవన్ లో కేటీఆర్ ను కలిసి సోనూ కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి మంత్రి కేటీఆర్ అభినందించారు. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా నలుమూలల నుండి వస్తున్న రిక్వెస్ట్ లకు సోను సూద్ స్పందిస్తున్న తీరుపై కేటీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా సంక్షోభంలో ఆశాజ్యోతిగా... వ్యక్తిగత స్థాయిలో లో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.