ప్రస్తుతం రాజకీయాల్లో మీడియా పాత్ర ఏ మేర ఉంటుందో అందరికీ తెలిసిందే. మీడియాలే పార్టీలకు పెద్ద బలమవుతున్నాయి. ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీకి సొంత మీడియా సంస్థలు ఉంటున్నాయి. అలాగే అనుకూల మీడియా సంస్థలు ఉంటున్నాయి. ఇక వీటి పని వచ్చి సొంత పార్టీలని పొగడటం, ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలు చేయడం. అటు తెలంగాణ కావొచ్చు, ఇటు ఏపీ కావొచ్చు రాజకీయ పార్టీలకు అనుకూల మీడియాలు ఉన్నాయి.