టీజీ వెంకటేష్....ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. చాలా ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్న టీజీ.. ఉమ్మడి ఏపీ విడిపోకుండా ఉండటం కోసం గట్టిగా పోరాడిన నాయకుడు. పలు సందర్భాల్లో తెలంగాణ నాయకులు, ఏపీ నేతలపై విమర్శలు చేసేటప్పుడు టీజీనే ఎదురుతిరిగి, తెలంగాణ నేతలకు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేసేవారు. అందుకే టీజీ అంటే తెలంగాణ నేతలకు పెద్దగా పడదు.