ఏపీలో రాజకీయ పరిస్తితులు ఇంకా టీడీపీకి అనుకూలంగా మారినట్లు కనిపించడం లేదు. టీడీపీ అధికారం కోల్పోయి దాదాపు రెండేళ్లు దాటేసినా సరే పార్టీ పుంజుకున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా వైసీపీకి కంచుకోటలుగా ఉన్న ప్రాంతాల్లో టీడీపీ ఉనికి చాటుకోవడమే కష్టంగా ఉందని చెప్పొచ్చు. అలాంటి చోట్ల మళ్ళీ టీడీపీ గెలుపు చాలా కష్టమైపోతుందనే చెప్పొచ్చు.