కొవిడ్ వైరస్ తో పోరాడి విజయం సాధించిన చాలామంది ఆ తర్వాత పోస్ట్ కొవిడ్ ఎఫెక్ట్స్ వల్ల ప్రాణాలొదిలారు. ఇటీవల కాలంలో బ్లాక్ ఫంగస్ ఇలా కరోనా విజేతల్ని ఇబ్బంది పెట్టింది. తాజాగా బోన్ డెత్ అనే వ్యాధి కరోనా విజేతలైనవారిని ఇబ్బంది పెడుతోంది. ఇది ప్రాణాంతకం కాకపోయినా 'అంతకు మించి' అన్నట్టుగా ప్రభావం చూపిస్తోంది. చేతులు, కాళ్లలోని ఎముకలు గుల్లగుల్లగా మారిపోవడం, రక్త సరఫరా లేక ఎముకలు నుజ్జునుజ్జయిపోవడం దీని లక్షణాలు. శస్త్ర చికిత్సతో ఉపయోగం ఉంటుందని చెబుతున్నా.. చాలామంది బాధితులు బోన్ డెత్ వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.