వారానికోసారి గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండింటిని కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశాలిచ్చారు సీఎం జగన్. వారానికి 4 సచివాలయాలను జాయింట్ కలెక్టర్లు సందర్శించాలని సూచించారు. మున్సిపాల్టీల కమిషనర్లు, ఐటీడీఏ పీవోలు వారానికి 4 సచివాలయాలు సందర్శించేలా ఆదేశాలిచ్చేట్టు ఉన్నతాధికారులకు సూచించారు. అంతేకాదు ఇలా సందర్శించిన తర్వాత వారు ఇచ్చే నివేదికలే వారి పనితీరుకి సూచికలుగా భావిస్తామని కూడా చెప్పారు సీఎం జగన్. దీన్నీ సీఎంఓ కార్యాలయం స్వయంగా పర్యవేక్షిస్తుందని చెప్పారు.