చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య భూ కబ్జాల ఆరోపణలు పెద్ద ఎత్తున నడుస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇటీవల వైసీపీ నేతలపై భూ కబ్జా ఆరోపణలు చేశారు. దాదాపు 400 కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని నల్లారి ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో నేషనల్ హైవేకు ఆనుకుని ఉన్న భూములని వైసీపీ నేతలు కబ్జా చేశారని చెబుతున్నారు.