రాష్ట్ర విభజన అనంతరం కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుండి నేటి వరకు తెలుగు రాష్ట్రాలకు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడం వలన పెద్దగా ఒరిగిందేమి లేదన్నది వాస్తవం. ఉపయోగం లేకపోగా బీజేపీ వలన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కారణం ఏమిటన్నది స్పష్టంగా తెలియకపోయినా తెలుగు ప్రజలపై బీజేపీ కరుణ చూపించడం లేదన్నది క్లియర్ గా అర్ధమవుతోంది.