శ్రీకాకుళం యువ ఎంపీ, టీడీపీ యువ నాయకుడు.. కింజరాపు రామ్మోహన్ నాయుడు విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహం బెడిసికొట్టిందా ? ఆయనను ఎలివేట్ చేయాలని చేసిన కసరత్తు ఫలించలేదా ? కేంద్రంలో కీలక పదవి కోసం చేసిన ప్రయత్నం ఆదిలోనే బెడిసి కొట్టిందని అంటున్నారు పార్టీ సీని యర్లు. అత్యంత రహస్య వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు. తాజాగా కేంద్ర ప్రభుత్వం మంత్రి వర్గాన్ని విస్తరిస్తున్న విషయం తెలిసిందే.